రాష్ర్టాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు సీఎం కావాలి

ABN , First Publish Date - 2022-12-16T23:52:27+05:30 IST

రాష్ర్టాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

రాష్ర్టాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు సీఎం కావాలి
బుచ్చెయ్యపేటలో ‘ఇదేం ఖర్మ.. ర్యాలీలో పాల్గొన్న తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, డిసెంబరు 16:రాష్ర్టాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. శుక్రవారం రాత్రి బుచ్చెయ్యపేటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతయ్యబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూరి చేయగా, సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టును గోదావరిలో ముంచారని విమర్శించారు. జగన్‌ అసమర్థ పాలన కారణంగా ఏపీ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని గద్దెనెక్కించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు, నాయకులు డొంకిన అప్పలనాయుడు, వియ్యపు అప్పారావు, గణపతిరాజు సన్యాసిరాజు, ముచ్చకర్ల తాతయ్యలు, గాడి సూరిఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:52:29+05:30 IST