నిత్యావసర ధరలు తగ్గించాలని టీడీపీ ధర్నా
ABN , First Publish Date - 2022-01-13T06:01:54+05:30 IST
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి అన్నారు.
గాజువాక, జనవరి 12: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పులి వెంకటరమణారెడ్డి, నమ్మి అప్పారావు, ముత్యాలరావు, నామాల పెంటయ్య, పెద్దాడ సొమినాయుడు, గొందేశి పెంటయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.