ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి

ABN , First Publish Date - 2022-10-17T07:03:09+05:30 IST

విద్యావంతులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గాడు చినలక్ష్మికుమారిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి
పట్టభద్రుల ఓటర్ల నమోదులో పాల్గొన్న పీవీజీ కుమార్‌



టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌

కె.కోటపాడు, అక్టోబరు 16: విద్యావంతులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గాడు చినలక్ష్మికుమారిని  గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సూదివలసలో ఆదివారం సాయంత్రం జరిగిన పట్టభద్రుల ఓటర్లు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మేధావులుదేనని అన్నారు. రాష్ట్రం ఆర్థిక మాధ్యంలోకి వెళ్లిపోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశంపార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సబ్బవరపు రామునాయుడు, కసిరెడ్డి అప్పలనాయుడు, జూరెడ్డి రాము, లెక్కల అవతారం, యడ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T07:03:09+05:30 IST