చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-12-15T00:16:05+05:30 IST

గుంటూరు లాంఫాం విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఏజీ బీఎస్సీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సీట్లు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు.

చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రతిభ

ఆరుగురికి ఏజీ బీఎస్సీలో సీట్లు

చింతపల్లి, డిసెంబరు 14: గుంటూరు లాంఫాం విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఏజీ బీఎస్సీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సీట్లు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. అగ్రి కల్చర్‌ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఏజీ బీఎస్సీలో చేరేందుకు ప్రతి ఏడాది విశ్వవిద్యాలయం అగ్రి సెట్‌ నిర్వహిస్తుంది. ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించిన విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏజీ బీఎస్సీలో ఎనిమిది సీట్లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన అగ్రి సెట్‌లో చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు అనకాపల్లి జిల్లాకు చెందిన ఆర్‌.భరత్‌ బాబు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్‌, రాజమండ్రికి చెందిన పి.లలిత ప్రశాంతి కుమారి రెండో ర్యాంక్‌, విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన ఎస్‌.శాంతి మూడో ర్యాంక్‌, శ్రీకాకుళం జిల్లా నరస్సన్నపేటకు చెందిన ఎస్‌.గీత ఐదో ర్యాంక్‌, ఎం.అమృత వర్షిణికి ఎనిమిదో ర్యాంక్‌, సీలేరుకు చెందిన ఎం. హర్షిత 21వ ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే. అగ్రి సెట్‌లో ర్యాంక్‌లు సాధించిన ఆరుగురు విద్యార్థులు బాపట్ల, నైరా, ఉదయగిరి, రాజమండ్రి, బద్వేల్‌, కదిరి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించారు. వీరిని ఏడీఆర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.రాజేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ సీతారాము, ఎం.శ్రీనివాసరావు, శాస్త్రవేత్తలు జోగారావు, సందీప్‌ నాయక్‌, టీచింగ్‌ అసోసియేట్స్‌ శ్వేత, జిన్నై, అనుషదేవి, సంతోషి అభినందించారు.

Updated Date - 2022-12-15T00:16:09+05:30 IST