కొంతమందికే జగనన్న ట్యాబ్‌లు

ABN , First Publish Date - 2022-12-16T23:56:50+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేపట్టను న్నారు.

కొంతమందికే జగనన్న ట్యాబ్‌లు

చోడవరం, డిసెంబరు 16: ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేపట్టను న్నారు. అయితే అందరికీ కాకుండా కొంతమందికే వీటిని అందజేయనున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 756 మంది కాగా, తొలివిడతగా 180 ట్యాబ్‌లు మండలానికి చేరాయి. బైజూస్‌ కంటెంట్‌ వినియోగానికి మాత్రమే ఉద్దేశించిన ఈ ట్యాబ్‌లు మండలంలోని మొత్తం విద్యార్థుల్లో నాలుగో వంతు కూడా లేకపోవడం గమనార్హం. తొలుత కొంత మంది విద్యార్థులకు 180 ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని, మిగిలిన వారికి దశలవారీగా ట్యాబ్‌లు అందే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారి తెలిపారు.

Updated Date - 2022-12-16T23:56:51+05:30 IST