నిధుల కోసం సర్పంచ్ దీక్ష
ABN , First Publish Date - 2022-10-17T06:24:10+05:30 IST
పంచాయతీకి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దారెల పంచాయతీ గన్నెడ గ్రామంలో ఆ పంచాయతీ సర్పంచ్ పి.పాండురంగ స్వామి ఆదివారం ప్రజా చైతన్య దీక్ష చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలో జమ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తానని వెల్లడి
ముంచంగిపుట్టు, అక్టోబరు 16: పంచాయతీకి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దారెల పంచాయతీ గన్నెడ గ్రామంలో ఆ పంచాయతీ సర్పంచ్ పి.పాండురంగ స్వామి ఆదివారం ప్రజా చైతన్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్నారు. పంచాయతీ ఖాతాలో నిధులు లేక గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. నిధులు ఇచ్చే వరకు తమ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాల్లో ప్రజా చైతన్య దీక్షను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.