మితిమీరిన అప్పులతో రాష్ట్రం దివాళా

ABN , First Publish Date - 2022-03-23T06:17:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో గొప్పల కోసం అప్పులు చేసి దివాళా తీయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు

మితిమీరిన అప్పులతో రాష్ట్రం దివాళా
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌లో గొప్పల కోసం అప్పులు చేసి దివాళా తీయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ 73వ వార్డు పరిధి వంటిళ్లు అన్న క్యాంటీన్‌ వద్ద మంగళవారం జరిగిన గౌరవ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో గొప్పలకు పోయి నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే గెలిచిన మూడు నెలల కాలంలోనే చెత్త పన్ను విధింపుతోపాటు ఆస్తి పన్ను పెంచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, వార్డు అధ్యక్షుడు గొలగాని రమణ, నాయకులు సింగూరు అనంత్‌, నమ్మి సింహాద్రి, చెరుకూరి నాగేశ్వరరావు, ముత్యాలమ్మ, ప్రభాకర్‌, కృష్ణ పాల్గొన్నారు.  


Read more