నక్కపల్లిలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-31T01:39:56+05:30 IST

మండల కేంద్రమైన నక్కపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి అండర్‌-19 బాల, బాలికల హాకీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

నక్కపల్లిలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న డీఎస్‌డీవో సూర్యారావు

నక్కపల్లి, డిసెంబరు 30 : మండల కేంద్రమైన నక్కపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి అండర్‌-19 బాల, బాలికల హాకీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. డీఎస్‌డీవో నగిరెడ్డి సూర్యారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేశ్‌, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పీటీసీ గోసల కాసులమ్మ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. వైస్‌ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, సర్పంచ్‌ నేతల జయరత్నకుమారి, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ రాంబాబు, నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, సెక్రటరీ తాతాజీ, హైస్కూల్‌ పీడీ కుందూరురాజు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శైలజ, హైస్కూల్‌ ఇన్‌చార్జి హెచ్‌ఎం అప్పారావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కర్రి పద్మ, జాతీయ హాకీ క్రీడాకారులు పీటర్‌, సీఎస్‌ రాజు, టీడీపీ నాయకులు కేవీ సత్యనారాయణ, మీగడ సత్తిబాబు, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:39:56+05:30 IST

Read more