దువ్వాడ మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2022-10-07T06:26:35+05:30 IST
దసరా తిరుగు ప్రయాణికుల సౌకర్యార్ధం దువ్వాడ, కొత్తవలస మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబరు 6: దసరా తిరుగు ప్రయాణికుల సౌకర్యార్ధం దువ్వాడ, కొత్తవలస మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం తెలిపారు. 07565 నంబరు గల రైలు ఈ నెల 7న(శుక్రవారం) మధ్యాహ్నం 3:25 గంటలకు నాందేడులో బయలుదేరి మర్నాడు ఉదయం 9:08 గంటలకు దువ్వాడ చేరి తిరిగి 9:10 గంటలకు బయలుదేరి అదేరోజు (శనివారం) సాయంత్రం 5:30 గంటలకు పూరి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07566 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 8న(శనివారం) రాత్రి 10:45 గంటలకు పూరిలో బయలుదేరి మర్నాడు ఉదయం 7:30 గంటలకు దువ్వాడ చేరి తిరిగి 7:32 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 1:00 (ఆదివారం అర్ధరాత్రి) గంటలకు నాందేడు చేరుతుంది.