అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-01-13T05:58:11+05:30 IST

ధనుర్మాసం ఆఖరి బుధవారం సందర్భంగా షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో స్వామి

అక్కిరెడ్డిపాలెం, జనవరి 12: ధనుర్మాసం ఆఖరి బుధవారం సందర్భంగా షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కృష్ణన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యాన్నదాన సమారాధనను 70వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి చందు ప్రారంభించారు. ఈ పూజల్లో సంఘ సభ్యులు తరపాక నాగార్జున, నంబారు రాజు, బి.చినఅప్పలస్వామి, విశ్వేశ్వరరావు, నూకినాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T05:58:11+05:30 IST