సౌత్‌ జోన్‌ యోగా చాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-26T03:00:26+05:30 IST

ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అమూల్య సంపద యోగా అని శ్రీ ప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌.విజయ్‌ప్రకా్‌ష అన్నారు.

సౌత్‌ జోన్‌ యోగా చాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభం

పాల్గొన్న పలు రాష్ట్రాల విద్యార్థులు

పెద్దాపురం, నవంబరు 25: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అమూల్య సంపద యోగా అని శ్రీ ప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌.విజయ్‌ప్రకా్‌ష అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ ప్రకాష్‌ పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ యోగా పోటీలు శుక్రవారం ప్రారంభించారు. పతంజలి యోగా చీఫ్‌ రిఫరీ రాపర్తి శ్రీను (విశాఖపట్టణం) మాట్లాడుతూ..యోగా హిందూత్వ ఆధ్యాత్మిక సాధనాల్లో ఒక భాగమన్నారు. ప్రొఫెసర్‌ సంతానం మాట్లాడుతూ.. శ్రీచక్రంలో ఉండే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి యోగా సాధనలో ముఖ్య భాగాలని తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి అండర్‌ 14 (బాలికలు), అండర్‌ 19 (బాలురు) యోగా పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎంవీఎ్‌స.మూర్తి, ఆకడమిక్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T03:00:28+05:30 IST