మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి

ABN , First Publish Date - 2022-10-03T06:27:30+05:30 IST

రాష్ట్ర విద్యుత్‌ రంగ సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చర్య లు తీసుకోవాలని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ సంస్థల కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు శనివారం రాత్రి తారువలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.

మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి
డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం ఇస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు


బూడికి విద్యుత్‌ సంస్థల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వినతి

చోడవరం, అక్టోబరు 2: రాష్ట్ర విద్యుత్‌ రంగ సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చర్య లు తీసుకోవాలని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ సంస్థల కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు శనివారం రాత్రి తారువలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా దశల వారీగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు పాతాళం అచ్చింనాయుడు, తర్రా శేషు, గొలుగొండ గణేష్‌, తప్పెట్ల గణేష్‌, కుమార్‌, శ్రీను, కృష్ణదాస్‌, అవతారం తితరులు పాల్గొన్నారు.

Read more