jayashali: పీడీ.సుందరరావు అల్లుడు జాన్సన్ విక్టర్ కన్నుమూత
ABN , First Publish Date - 2022-11-29T15:00:20+05:30 IST
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ పీడీ.సుందరరావు అల్లుడు, జాయింట్ డైరెక్టర్ జాన్సన్ విక్టర్ కన్నుమూశారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో
విశాఖ: బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ పీడీ.సుందరరావు (pd sundar rao) అల్లుడు, జాయింట్ డైరెక్టర్ జాన్సన్ విక్టర్(King Johnson Victor) కన్నుమూశారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించారు. దీంతో ఆయన అభిమానులు, BOUI స్టూడెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ మధ్యాహ్నం కర్నాటకలోని బల్లారిలో బైబిల్ ప్రసంగం చేస్తుండగా ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు వదిలారు. అక్కడ నుంచి ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా మోదువలసలో రాత్రి 9 గంటలకు సమాధి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాన్సన్ విక్టర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ, విదేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కోసం విశాఖపట్నానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

‘కనుమూయక ముందే.. తెలుసుకో ఓ నిజాన్ని’ ఈ పాట ఎంతో పాఫులర్. ఆయనే స్వయంగా రచించి పాడిన ఈ పాట పెద్ద సంచలనం. ఆయన రచన, స్వరకల్పన నుంచి అనేక పాటలు వచ్చాయి.

