Somu Virraju comments: జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ..
ABN , First Publish Date - 2022-08-10T19:32:14+05:30 IST
బీజేపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ (Tiranga rally) ప్రారంభమైంది.

విశాఖ (Visakha): బీజేపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ (Tiranga rally) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Virraju), మాధవ్ (Madhav), విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju), కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆజాద్‌కి అమృత్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపిచ్చారు. ఈనెల 14న మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ విభజన సమయంలో జిన్నా ఆకృత్యాలను జాతికి గుర్తు చేస్తామన్నారు. జాతీయ జెండాను ఎగుర వేసే హక్కు ఈ దేశ ప్రజలు అందరికీ ఉంటుందన్నారు. అసలు ఉనికిలోనే లేని కాంగ్రెస్ పార్టీకి మాపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సోము వీర్రాజు అన్నారు.