నేటి నుంచి జగనన్న ఇళ్లపై సోషల్‌ ఆడిట్‌

ABN , First Publish Date - 2022-11-12T01:18:04+05:30 IST

జగనన్న కాలనీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ ఆరోపించారు.

నేటి నుంచి జగనన్న ఇళ్లపై సోషల్‌ ఆడిట్‌

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌

డాబాగార్డెన్స్‌, నవంబరు 11 : జగనన్న కాలనీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ ఆరోపించారు. డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ’జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో పోస్టర్‌ను ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో జన సైనికులు జగనన్న కాలనీలను పరిశీలించి అధిష్ఠానానికి నివేదిక అందజేయాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదేశించారని తెలిపారు. .14న సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. పీఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం లేని చోట్ల ఇళ్లను కేటాయించారని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోదీకి పవన్‌కల్యాణ్‌ వివరించారని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, ఉత్తర ఇన్‌చార్జ్‌ పసుపులేటి ఉషాకిరణ్‌, నాయకులు గడసాల అప్పారావు, సంకు వెంకటేశ్వరరావు, వసంతలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:18:04+05:30 IST

Read more