AP News: సీఎం జగన్పై శైలజానాథ్ ఘాటైన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-08-10T18:34:03+05:30 IST
సీఎం జగన్పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ (Visakha): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి (Shailajanath Reddy) ఘాటైన వ్యాఖ్యలు (Comments) చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో (AP) పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అంతా ఆరాచకమే జరుగుతోందని, సీఎం జగన్ (CM Jagan), ప్రధాని మోదీ (PM Modi) కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి జగన్ దాసోహం అయిపోయారని, అందుకే ప్రత్యేక హోదా (Special Status) అడగడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్నా... అడగవాల్సిన ముఖ్యమంత్రి, మోదీ కాలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే 175 స్థానాలు వస్తాయని సీఎం జగన్ అంటున్నారని, ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రుషికొండను చూస్తే పాలన ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్లో ఇంకెంత మంది ఇలా దర్శనం ఇస్తారోనని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.