కారు ఢీకొని సచివాలయ ఉద్యోగి స్వల్ప గాయాలు

ABN , First Publish Date - 2022-08-04T06:45:45+05:30 IST

జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న బాదంపూడి సంతోష్‌ అనే అంథుడ్ని బుధవారం కారు ఢీకొంది.

కారు ఢీకొని సచివాలయ ఉద్యోగి స్వల్ప గాయాలు

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 3 : జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న బాదంపూడి సంతోష్‌ అనే అంథుడ్ని బుధవారం కారు ఢీకొంది. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలయ్యాయి.  పట్టణంలోని చాకలిపేటకు చెందిన ఇతడు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరి కార్యాలయం ముందుకు చేరుకున్నాడు.  అదే సమయంలో కార్యాలయం ముందు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ కారు ఆగింది. ఆ కారు నుంచి ఏసీపీ దిగారు. ఆయన దిగిన వెంటనే డ్రైవర్‌ కారును వెనుక్కు తిప్పే క్రమంలో సంతోష్‌ను ఢీకొనడంతో స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఏసీపీ కానీ, అతని కారు డ్రైవర్‌ కానీ సంతోష్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అక్కడివారు ఆశ్చర్యపోయారు. స్థానికులు సపర్యలు చేయడంతో  కాసేపు అనంతరం  సంతోష్‌ కార్యాలయంలోనికి వెళ్లిపోయాడు. 


Updated Date - 2022-08-04T06:45:45+05:30 IST