ఈ-క్రాప్‌, ఈ-కేవైసీలపై కలెక్టర్‌ పరిశీలన

ABN , First Publish Date - 2022-10-17T07:04:22+05:30 IST

Scrutiny of Collector on e-Crop and e-KYC

ఈ-క్రాప్‌, ఈ-కేవైసీలపై కలెక్టర్‌ పరిశీలన
వ్యవసాయాధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి


మాడుగుల రూరల్‌, అక్టోబరు 16 : మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి ఆదివారం పర్యటించారు. రైతులు సాగు చేస్తున్న పంటలు, ఈ-క్రాప్‌, ఈ-కేవైసీల నమోదుపై ఆరా తీశారు. మండలంలోని తాటిపర్తి, కూర్మనాథపురం, సాగరం, ఎం.కోడూరు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలు, వ్యవసాయాధికారులు నమోదు చేస్తున్న ఈ- క్రాప్‌, ఈ-కేవైసీ, సర్వే నంబర్లు సక్రమంగా ఉన్నాయో.. లేదో.. తదితర అంశాలు పరిశీలించారు. ఎంతవరకు ఈ-కేవైసీ చేశారని వ్యవసాయాధికారి వాసుదేవరావుని కలెక్టర్‌ ప్రశ్నించగా 88 శాతం పూర్తయిందని బదులిచ్చారు. కాగా ఎం.కోడూరులో పలువురు గ్రీన్‌ అంబాసిడర్లు ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. అనంతరం ఎం.కోటపాడు సచివాలయం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు పీవీ. రత్నం, ఎంపీడీవో మీనాకుమారి, డీటీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T07:04:22+05:30 IST