అసౌకర్యాల సంత

ABN , First Publish Date - 2022-10-17T06:04:14+05:30 IST

ఏజెన్సీలోనే అతి పెద్ద సంతగా ప్రతి శుక్రవారం అరకులోయలో జరిగే వారపు సంతకు గుర్తింపు ఉంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో సంత జరుగు తుంది.

అసౌకర్యాల సంత
అరకులోయలో టార్పాలిన్లతో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దృశ్యం

అరకులోయ వారపు సంతలో సమస్యల తిష్ఠ

షెడ్లు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం లేక ఇక్కట్లు

పార్కింగ్‌ వసతి లేక ట్రాఫిక్‌ కష్టాలు

గోదాములు లేక వ్యాపారుల అవస్థలు

వానొస్తే ప్రాంగణం బురదమయం


అరకులోయ, అక్టోబరు 16: ఏజెన్సీలోనే అతి పెద్ద సంతగా ప్రతి శుక్రవారం అరకులోయలో జరిగే వారపు సంతకు గుర్తింపు ఉంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో సంత జరుగు తుంది. అరకులోయ, హుకుంపేట, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల నుంచి గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు, ఫలసాయాన్ని విక్రయించేందుకు ఈ సంతకే వస్తుంటారు. అలాగే ఆయా మండలాల నుంచి చిరువ్యాపారులు, వినియోగ దారులు ఈ సంతకే వస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సంతలో కనీస సౌకర్యాలు లేవు. వ్యాపారులకు శాశ్వత షెడ్లు, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బం దులు తప్పడం లేదు. పార్కింగ్‌ సౌకర్యం లేక ట్రాఫిక్‌ సమస్య లు ఎదురవు తున్నాయి. సుమారు రెండు వేల మంది వ్యాపారులు టార్పాలిన్లతో తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసు కున్నారు. కాఫీ, మిరియాల వంటి సీజన్‌లో ఒక వారంలో జరిగే సంతలో సుమారు రూ.2 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. అన్ని రకాల వస్తువులతో పాటు కూర గాయలు కూడా లభిస్తాయి. నిల్వ చేసుకోవడానికి సదు పాయం లేక సంతలో విక్రయించగా మిగిలిన సరకును తిరిగి తీసుకువెళ్లడానికి వ్యాపారులు, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సంత స్థలంలో కాకుం డా రోడ్డుపై కూడా దుకాణాలను ఏర్పాటు చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది. ఆశీలు వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు కనీస వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. షెడ్లు లేకపోవడంతో వర్షాలు కురిసినప్పు డు ఇబ్బందులు పడుతున్నామని, అలాగే సంత ప్రాంగణం బురద మయంగా మారడంతో వినియోగదారులు కూడా రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కాగా ఆదివారం సుంకరమెట్టలో, బుధవారం కించుమండలో, శనివారం లోతేరులో వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో కూడా కనీస సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడు తున్నారు. 

Updated Date - 2022-10-17T06:04:14+05:30 IST