ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

ప్రజా రవాణాశాఖ (పీటీడీ) బస్సుల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా ఇవ్వాలని, అందుకు సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పీటీడీ విశాఖ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ (డీసీఎంఈ) బి.అప్పలనాయుడు సూచించారు.

ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వాలి
పీటీడీ సాంకేతిక సిబ్బందికి, డ్రైవర్లకు సూచనలిస్తున్న అప్పలనాయుడు

పీటీడీ విశాఖ రీజియన్‌ డీసీఎంఈ అప్పలనాయుడు 

ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 13: ప్రజా రవాణాశాఖ (పీటీడీ) బస్సుల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా ఇవ్వాలని, అందుకు సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పీటీడీ విశాఖ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ (డీసీఎంఈ) బి.అప్పలనాయుడు సూచించారు. గాజువాక డిపో గ్యారేజీలో మంగళవారం ఆయన సాంకేతిక సిబ్బంది, పలువురు డ్రైవర్లతో సమావేశమై సూచనలు సలహాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన బస్సు దగ్ధం ఘటనను ప్రతీఒక్కరూ గుణపాఠంగా తీసుకోవాలన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంపింగ్‌, అతివేగంగా బస్సును నడపడంవంటివి ప్రమాదకరమన్నారు. మనం నడుపుతున్న బస్సుల్లో కనీసంగా 50 మంది ప్రయాణికులు వున్నరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లు బస్సులు నడపాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీటీడీ గాజువాక డిపో మేనేజర్‌ వి.ప్రవీణ, గ్యారేజీ ఇన్‌చార్జి కేఎస్‌డీ ప్రసాద్‌, గ్యారేజీ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-13T05:30:00+05:30 IST