పరిశ్రమల్లో భద్రత గాలికి
ABN , First Publish Date - 2022-08-04T06:50:50+05:30 IST
పరిశ్రమల్లో భద్రతను గాలికి వదిలేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చేసి తరువాత మర్చిపోవడం ఉమ్మడి విశాఖ జిల్లాలోని అధికారుల నుంచి యజమానుల వరకు సాధారణమైపోయింది. ప్రతినెల సగటున రెండు నుంచి మూడు ప్రమాదాలు జరుగుతున్నా వీరి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
కాగితాలకే పరిమితమైన సేఫ్టీ ఆడిట్
ప్రమాదం జరిగినప్పుడే అధికారుల పరుగులు
భద్రతపై నిరంతర పర్యవేక్షణ కరవు
సేఫ్టీ అడ్వయిజరీ వ్యవస్థ అవసరమంటున్న నిపుణులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
పరిశ్రమల్లో భద్రతను గాలికి వదిలేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చేసి తరువాత మర్చిపోవడం ఉమ్మడి విశాఖ జిల్లాలోని అధికారుల నుంచి యజమానుల వరకు సాధారణమైపోయింది. ప్రతినెల సగటున రెండు నుంచి మూడు ప్రమాదాలు జరుగుతున్నా వీరి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
జిల్లాలోని పరిశ్రమల్లో భద్రత, కాలుష్యం వంటి అం శాలపై సంబంధిత శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీ లో మంగళవారం జరిగిన ఘటనతో పరిశ్రమల్లోని భద్రత డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై మరోసారి పెద్దఎత్తు న చర్చ జరుగుతోంది. సీడ్స్ కంపెనీ ప్రమాదకరమైన జాబి తాలో లేకపోయినా రెండు నెలల వ్యవధిలో వంద మంది మహిళలు అస్వస్థతకు గురికావడం కలవరపాటుకు గురిచే సింది. దీనినిబట్టి సీడ్స్ కంపెనీ నిర్వహణలో యాజమాన్యం బాధ్యతారాహిత్యం తేటతెల్లమవుతోంది. అంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, ఇతర శాఖల పర్యవేక్షణ కొరవడిందని తేలిపోయింది.
ప్రమాదకర పరిశ్రమలున్నా...
రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదకరమైన పరిశ్రమలున్నది ఉమ్మడి విశాఖ జిల్లాలోనే. రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ లీక్ ఘటనతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశ్రమల భద్రత, కాలుష్య నియంత్రణ వంటి అంశాలు చర్చకు రాగా ప్రభు త్వం ప్రత్యేకించి బృందాలను నియమించి, తనిఖీలు చేయిం చింది. అప్పట్లో బృందాలు ఆయా పరిశ్రమలను పరిశీలించి, గుర్తించిన లోపాలపై నివేదికలు అందజేశాయి. వాటి మేర కు పరిశ్రమలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలి సింది. ఆ తరువాతా పరిశమ్రల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అధికారుల హడావిడి మినహా, కారణాలు అన్వేషించి నివారణకు చర్య లు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
భద్రత ఆడిట్‌కు మంగళం
నిబంధనల మేరకు పరిశ్రమల్లో ప్రతి ఏటా విఽధిగా భద్ర తా ఆడిట్ జరగాలి. దీనికోసం ప్రభుత్వం గుర్తించిన నిపుణు లతో మాత్రమే సేఫ్టీ ఆడిట్ చేయించాలి. కానీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అమరావతి కార్యాలయం సిఫారసులతో కొందరు నిపుణులకే సేఫ్టీ ఆడిట్ పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఇది కూడా తూతూమంత్రంగా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పరిశ్రమలు రెండు మూడేళ్లకు ఒకసారి సేఫ్టీ ఆడిట్‌ను చేపడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆడిట్ జరిగినా నిపుణుల సూచనలు ఏమాత్రం పాటించడం లేదు. అదే సమయంలో పరిశ్రమ ల్లో ఆడిట్ నివేదికలు అమలు చేస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించేందుకు అధికారుల కొరత వెంటాడుతోంది. విశాఖ నగరంతోపాటు పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలో పదుల సంఖ్యలో పరిశ్రమలను పర్యవేక్షించడానికి ప్రస్తు తం ఉన్న అధికారులు, సిబ్బంది సరిపోరని తెలిసినా ప్రభు త్వం కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. చివరకు వారికి తగిన వాహనాలు కూడా లేవన్నది వాస్తవం.
అడ్వయిజరీ వ్యవస్థకూ దిక్కులేదు
ప్రతి పరిశ్రమలో పర్యావరణం, ఆక్యుపేషనల్ హెల్త్, సేఫ్టీ ముఖ్యమైన అంశాలు.... ఈ మూడు కలిసికట్టుగా అమలుచేస్తే తప్ప ప్రమదాలు నివారించలేమని నిపుణులు చెబుతున్నారు. ఇంకా సేఫ్టీ ఇంటిగ్రేషన్ లెవెల్ మేరకు పరిశ్రమలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రామాణికాలు ఉన్నాయన్నది కొందరు పరిశ్రమ నిర్వాహకులకు తెలియ దని వ్యాఖ్యానిస్తున్నారు. భద్రతకు అడ్వయిజరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమల నిర్వహణపై సేఫ్టీ ఆడిట్ నిపుణులు ఇచ్చిన సూచనలు అమలుచేసేలా యాజమాన్యాలను అప్రమత్తం చేయడంలో ఈ వ్యవస్థ కీలకభూమిక పోషిస్తుంది. ఐరోపా వంటి దేశా ల్లో ఈ వ్యవస్థలను ప్రభుత్వాలే నియమించి, పరిశ్రమల్లో ప్రమాదాలను నియంత్రిస్తాయి. నూతన సాంకేతికతను వివరించేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుంది. ఇటువంటి వ్యవస్థ మనవద్ద అమలుచేస్తే పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని ఏయూ కెమి కల్ ఇంజనీరింగ్ విభాగం రిటైర్డు ఆచార్యుడు పీజే రావు అభిప్రాయపడ్డారు.