టీడీపీ కార్యకర్తకు రూ.50 వేలు సాయం
ABN , First Publish Date - 2022-10-07T06:06:57+05:30 IST
గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గజ్జలపు కృష్ణ బ్రెయిన్‌స్ట్రోక్‌తో విశాఖపట్నం కిమ్స్ హస్పిటల్‌లో వైద్య పొందుతున్నారు.
కృష్ణాదేవిపేట, అక్టోబరు 6: గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గజ్జలపు కృష్ణ బ్రెయిన్‌స్ట్రోక్‌తో విశాఖపట్నం కిమ్స్ హస్పిటల్‌లో వైద్య పొందుతున్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్, తదితరులు గజ్జలపు కృష్ణ, కుటుంబ సభ్యులను విశాఖపట్నం ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరుపున రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కొల్లు సత్యనారాయణ, కొత్తయల్లవరం సర్పంచ్ రాంబాబు పాల్గొన్నారు.