సీమ ముసుగులో జగన్‌ కూలీల చిల్లర రాజకీయాలు: కాల్వ

ABN , First Publish Date - 2022-11-19T03:04:42+05:30 IST

రాయలసీమ ఉద్యమం ముసుగులో జగన్‌ కూలీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

సీమ ముసుగులో జగన్‌ కూలీల చిల్లర రాజకీయాలు: కాల్వ

అనంతపురం అర్బన్‌, నవంబరు 18: రాయలసీమ ఉద్యమం ముసుగులో జగన్‌ కూలీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలులో కొంత మంది సీమ ద్రోహులు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కల్పించడం సిగ్గుచేటని అన్నారు. మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుకు వస్తున్న విశేష స్పందనను తట్టుకోలేక వైసీపీ నేతలు తమ పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దింపారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఉండాలన్నది చంద్రబాబు నిర్ణయమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే అది సాధ్యపడేదని అన్నారు.

Updated Date - 2022-11-19T03:04:42+05:30 IST

Read more