పారదర్శకంగా పారిశుధ్య కార్మికుల నియామకాలు

ABN , First Publish Date - 2022-12-31T00:31:04+05:30 IST

జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుల ఉద్యోగ నియామకాలను నిష్పక్షపాతంగా చేపడుతున్నామని కమిషనర్‌ రాజాబాబు తెలిపారు

పారదర్శకంగా పారిశుధ్య కార్మికుల నియామకాలు

వెంకోజీపాలెం, డిసెంబరు 30 : జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుల ఉద్యోగ నియామకాలను నిష్పక్షపాతంగా చేపడుతున్నామని కమిషనర్‌ రాజాబాబు తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ నియమించిన ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో నియామకాలను చేపడుతు న్నామని చెప్పారు. దరఖాస్తుదారులు దళారులను నమ్మి మోసపోవద్దని, పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయ నాయకులకు, కార్మిక సంఘాలకు ఇందులో ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-31T00:31:11+05:30 IST