తుక్కు వేలంతో రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
ABN , First Publish Date - 2022-01-13T06:29:09+05:30 IST
వాల్తేరు రైల్వే డివిజన్ తుక్కు విక్రయంలో సరికొత్త రికార్డు సాధించింది.
ఒకేరోజు రూ.13.20 కోట్ల తుక్కు అమ్మకం
విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్ తుక్కు విక్రయంలో సరికొత్త రికార్డు సాధించింది. బుధవారం నిర్వహించిన వేలంలో ఒకేరోజు రూ.13.20 కోట్ల విలువైన తుక్కు విక్రయించింది. డివిజన్ ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఒకేసారి రావడం ఇదే ప్రథమం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.89.13 కోట్ల తుక్కు అమ్మినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సెత్పతీ ఆధ్వర్యంలో సీనియర్ డివిజినల్ మెటీరియల్స్ మేనేజర్ కేబీ తిరుపతయ్య ఈ వేలం నిర్వహించారు.