-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » raiwada jalasayam nunchi-NGTS-AndhraPradesh
-
రైవాడ జలాశయం నుంచి నీరు విడుదల
ABN , First Publish Date - 2022-09-11T06:08:09+05:30 IST
మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో శనివారం సాయంత్రం 1200 క్యూసెక్కులు ఒక రెగ్యులేటింగ్ గేటు నుంచి బయటకు విడుదల చేశారు.

- 1200 క్యూసెక్కులు దిగువకు..
దేవరాపల్లి, సెప్టెంబరు 10: మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో శనివారం సాయంత్రం 1200 క్యూసెక్కులు ఒక రెగ్యులేటింగ్ గేటు నుంచి బయటకు విడుదల చేశారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా 113.50 మీటర్లకు చేరడంతో వరద నీటిని బయటకు విడుదల చేశామని జలాశయ ఏఈఈ సత్యంనాయుడు తెలిపారు. వరద నీరు పెరిగితే కిందకు వదిలే పరిస్థితి ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.