పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు ఈ నెల 11 వరకు పెంపు

ABN , First Publish Date - 2022-08-04T05:46:53+05:30 IST

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని పాలీసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాల అధికారులు డాక్టర్‌ కె.వి.రమణ, జీవివి.సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.

పాలీసెట్‌ కౌన్సెలింగ్‌  గడువు ఈ నెల 11 వరకు పెంపు

కంచరపాలెం, ఆగస్టు 3 : పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని పాలీసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాల అధికారులు డాక్టర్‌ కె.వి.రమణ, జీవివి.సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. గత నెల 27 నుంచి నగరంలో ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక శాఖ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల ఐదుతో ముగియాలి. అయితే పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో పాసైన విద్యార్థులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విధంగా షెడ్యూల్‌ను పొడిగించినట్టు అధికారులు తెలిపారు. నూతన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 11వ తేదీ వరకు  కౌన్సెలింగ్‌ జరగనున్నది. ఆప్షన్ల ఎంట్రీకు ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆప్షన్స్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీన అవకాశం కల్పించారు. 16న సీట్ల కేటాయింపు జగరనుంది.

Updated Date - 2022-08-04T05:46:53+05:30 IST