నర్సరీ శిక్షణ కేంద్రాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2022-08-18T06:18:53+05:30 IST
ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యానవన శాఖ నర్సరీ శిక్షణ కేంద్రాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

ఉద్యానవన శాఖాధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం
పాడేరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యానవన శాఖ నర్సరీ శిక్షణ కేంద్రాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం రాత్రి ఉద్యావన శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో చింతపల్లి, అరకులోయ మండలం కొత్తవలసలో ఉన్న హెచ్‌ఎన్‌టీసీల్లో ఔషధ మొక్కలు, ఉద్యానవన తోటలు, మిరియాల నర్సరీల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వాటిలో భూమి చదును పనులు చేపట్టి, నర్సరీలకు అవసరమైన నీటి సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాలీహౌస్‌లు నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ భూములపై సమగ్రమైన సర్వే చేసి నివేదిక సమర్పించాలని అరకులోయ తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. గిరిజన రైతులకు అవసరమైన ఉద్యాన మొక్కలు అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు, ఐటీడీఏ ఉద్యానవనాధికారి ఎన్.శరత్, ఐటీడీఏ వ్యవసాయాధికారి కె.ఝాన్సీలక్ష్మి, ఏజెన్సీలోని ఉద్యానవనాధికారులు పాల్గొన్నారు.