మిరియాల రైతులు అధిక దిగుబడులు సాధించాలి

ABN , First Publish Date - 2022-10-17T06:03:02+05:30 IST

మన్యంలో మిరియాల రైతులు అధిక దిగుబడులు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు సూచించారు.

మిరియాల రైతులు అధిక దిగుబడులు సాధించాలి
జెండా ఊపి విజ్ఞానయాత్ర బస్సును ప్రారంభిస్తున్న జేసీ శివశ్రీనివా

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాసు 


పాడేరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మిరియాల రైతులు అధిక దిగుబడులు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు సూచించారు. ఆదివారం మిరియాల రైతుల విజ్ఞాన యాత్రకు బయలుదేరుతున్న బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాఫీ, మిరియాల రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. అక్కడ రైతుల సస్యరక్షణ చర్యలను పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. అలాగే నాణ్యమైన మిరియాల ఉత్పత్తికి కృషి చేయాలని జేసీ సూచించారు. స్పైసెస్‌ బోర్డు అధికారి కల్యాణి మాట్లాడుతూ ఏజెన్సీలో పాడేరు మండలం మోదాపల్లి, అరకులోయ మండలం చినలబుడు గ్రామాలకు చెందిన ఎంపిక చేసిన 32 మంది రైతులను కర్ణాటక రాష్ట్రంలో మైసూర్‌, సికిలెస్‌పూర్‌, మరికేరి ప్రాంతాల్లోని రైతులు చేపడుతున్న కాఫీ, సుగంధ ద్రవ్యాల సాగును పరిశీలిస్తారన్నారు. పది రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందన్నారు. 


Updated Date - 2022-10-17T06:03:02+05:30 IST