లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-10-07T06:08:30+05:30 IST
తాండవ రిజర్వాయర్లో నీటి నిల్వలు ప్రమాదస్థాయికి చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండవ రిజర్వాయర్ డీఈఈ రాజేంద్రకుమార్ కోరారు.
డీఈఈ రాజేంద్రకుమార్
నాతవరం. అక్టోబరు 6: తాండవ రిజర్వాయర్లో నీటి నిల్వలు ప్రమాదస్థాయికి చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండవ రిజర్వాయర్ డీఈఈ రాజేంద్రకుమార్ కోరారు. గురువారం ఆయన రిజర్వాయర్ను సందర్శించి, నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. వర్షాలు విస్తారంగా పడుతుండడంతో తాండవ నది పక్కనే ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నదిలోకి ఎవ్వరూ దిగవద్దని హెచ్చరించారు. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుతం తాండవలో 377.4 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయని, ఇన్ఫ్లో ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. కుడి, ఎడమ కాలువలకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.