సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు : బీజేపీ

ABN , First Publish Date - 2022-10-02T06:21:20+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికే తాము ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు లాలం వెంకటరమణ అన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు : బీజేపీ
ఎంబీపట్నంలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నాయకులునాతవరం అక్టోబరు 1 : ప్రజా సమస్యల పరిష్కారానికే తాము ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు లాలం వెంకటరమణ అన్నారు. శనివారం మండలంలో ఎంబీపట్నం, గన్నవరం గ్రామాలలో ప్రజాపోరు యాత్ర నిర్వహించి, ఆయా గ్రామాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల్లో 80శాతం   కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం స్టిక్టర్లు వేసుకుని తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కిల్లాడ వెంకటరజనీ, జిల్లా ఓబీసీ కోశాధికారి, చుక్కల రాంబాబు, నర్సీపట్నం మండల శాఖ అధ్యక్షుడు బోళెం శివ, చింతకాయల చిట్టిబాబు, గండేపల్లి మురళి,గుడివాడ లోవరాజు పాల్గొన్నారు. 

Read more