Jagan సెకండ్ వేవ్ మొదలు పెట్టారు: పల్లా Srinivas

ABN , First Publish Date - 2022-06-07T19:54:14+05:30 IST

బీసీ నాయకులను వేధించడంలో సీఎం జగన్ సెకండ్ వేవ్ మొదలు పెట్టారని పల్లా శ్రీనివాస్ విమర్శించారు.

Jagan సెకండ్ వేవ్ మొదలు పెట్టారు: పల్లా Srinivas

Visakhapatnam: బీసీ నాయకులను వేధించడంలో సీఎం జగన్ (CM Jagan) సెకండ్ వేవ్ మొదలు పెట్టారని టీడీపీ నేత, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‌సిఐడి అధికారులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు గౌతు శిరీషపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, నోటీసు కూడా ఇవ్వకుండా ఆమెను ఏడు గంటలపాటు స్టేషన్‌లో ఉంచారన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు ఎప్పుడూ ఇంత దారుణంగా లేవని.. దీనికి పూర్తి భాద్యత ప్రభుత్వానిదేనని పల్లా శ్రీనివాస్ అన్నారు.

Read more