తడిసిన వరి పనలకు మొలకలు
ABN , First Publish Date - 2022-12-16T00:00:11+05:30 IST
తుఫాన్ వర్షాలకు పొలాల్లోని వరి పనాలు నీటిలో నానడంతో ధాన్యం మొలకలు వచ్చాయి.
నాతవరం, డిసెంబరు 15: తుఫాన్ వర్షాలకు పొలాల్లోని వరి పనాలు నీటిలో నానడంతో ధాన్యం మొలకలు వచ్చాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నుంచి ఎండ కాస్తుండడంతో పదును అరడానికి వరి పనలను రైతులు తిరగేస్తుండగా.. మరికొన్నిచోట్ల వరి పనలు ధాన్యం మొలకలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు ఎండ కాస్తే వరి పనలు ఆరితే వరి కుప్పలు పెడదామనుకున్న సమయంలో శుక్రవారం నుంచి తుఫాన్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈసారి వర్షం వస్తే పొలాల్లో ఉన్న వరి పనలు మొలకలు వచ్చి పూర్తిగా పాడైపోతుందని రైతులు చెబుతున్నారు. రోడ్డు పక్క పొలాలు ఉన్న రైతులు మాత్రం తడిసిన వరి చేనును నూర్చి తడి ధాన్యాన్ని ఎండలో అరబెడుతున్నారు. రోడ్డుకు దూరంలో ఉండి పొల్లాలో ఉన్న వరి పనలను రైతులు ఎండలో అరబెడుతున్నారు. ధాన్యం మొలకలు వచ్చిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.