ముమ్మరంగా వరి కోతలు

ABN , First Publish Date - 2022-11-30T00:41:49+05:30 IST

వాతవరణం అనుకూలించడంతో గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి.

ముమ్మరంగా వరి కోతలు
గొలుగొండ మండలంలో వరి కోతలు కోస్తున్న కూలీలు

మాకవరపాలెం,నవంబరు 29: వాతవరణం అనుకూలించడంతో గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండలంలో మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, గిడుతూరు, బయ్యవరం, మల్లవరం గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు రోజలుగా ఎండలు కాస్త ఎక్కువగా ఉండడం, మంచు కూడా కురవడంతో రైతులు వరికోతలపై దష్టి సారించారు. దీంతో రెండు రోజులుగా వరి కోతలు సాగుతున్నాయి.

గొలుగొండలో...

గొలుగొండ: మండలంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి. మండలంలో పాతమల్లంపేట, పప్పుశెట్టిపాలెం, జోగంపేట, గొలుగొండ, ఏటిగైరంపేట, కొత్తఎల్లవరం, రావణాపల్లి, అమ్మపేట, కొత్త్తమల్లంపేట గ్రామాల్లో ఆర్‌జీఎల్‌, తేలిక రకం వరి పంటలు పండాయి. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా వుండడంతో గ్రామాల్లో వరి కోత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

Updated Date - 2022-11-30T00:41:49+05:30 IST

Read more