పోర్టు ‘సాగరమాల’ ఆడిటోరియం ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-06T05:10:48+05:30 IST

జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్‌ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు.

పోర్టు ‘సాగరమాల’ ఆడిటోరియం ప్రారంభం
ఆడిటోరియం ప్రారంభిస్తున్న పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహనరావు

ప్రారంభించిన చైర్మన్‌ రామ్మోహనరావు

విశాఖపట్నం, మార్చి 4 : జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్‌ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా లైవ్‌ గజల్‌ కన్సర్ట్‌, మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ గజల్‌ గాయకుడు డాక్టర్‌ హరిఓం హిందీ, తెలుగు గజల్స్‌ ఆలపించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సత్పతి తదితరులు పాల్గొన్నారు.  

Read more