కాలువలో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-07-07T06:25:21+05:30 IST

రోడ్డు పక్క కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గ్రేటర్‌ 98వ వార్డు సింహాచలం ప్రధానమార్గంలో బుధవారం జరిగింది.

కాలువలో పడి ఒకరి మృతి
కాలువలో మృతదేహం

సింహాచలం, జూలై 7: రోడ్డు పక్క కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గ్రేటర్‌ 98వ వార్డు సింహాచలం ప్రధానమార్గంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆయిల్‌మిల్లులో కలాశీగా పనిచేస్తున్న అప్పల అప్పారావు (50) బుధవారం  పని వెళ్లి, మధ్యాహ్న భోజన విరామంలో మద్యం మత్తులో కల్వర్టు గోడమీద నిద్రించాడు. కొద్దిసేపటి తరువాత కల్వర్టుపై నుంచి దొర్లి కాలువలో పడి, బురదలో తల కూరుకు పోవబంతో మృతి చెందాడు. బాటసారులు చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అతని వద్ద లభించిన ఆధార్‌ కార్డు ప్రకారం విజయనగరం జిల్లా ఎల్‌.కోట ప్రాంతానికి చెందిన వాడని, ఇతడి భార్య చనిపోయిందని, తల్లి ఉందని తెలిపారు. బంధువులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. 


Read more