మరోసారి విద్యుత్‌ చార్జీల షాక్‌

ABN , First Publish Date - 2022-08-13T06:37:51+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి కరెంట్‌ షాక్‌ ఇవ్వనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

మరోసారి విద్యుత్‌ చార్జీల షాక్‌
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్‌


టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 12: విద్యుత్‌ వినియోగదారులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి కరెంట్‌ షాక్‌ ఇవ్వనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో మరోసారి వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబరు నెల నుంచి ఈ ఛార్జీల మోత మోయించనున్నారన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు విద్యుత్‌ ఛార్జీలు పెంచారన్నారు. ఇప్పుడు మరోసారి ట్రూ ఆఫ్‌ ఛార్జీలు రూ.637 కోట్లు వసూలు చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్‌ కోతలు లేకుండా చంద్రబాబునాయుడు నాణ్యమైన విద్యుత్‌ను ఐదేళ్లు ఇచ్చారన్నారు. జగన్‌రెడ్డి మాత్రం మాటిమాటికీ విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. నవరత్నాలు అందరికీ రాకపోయినా విద్యుత్‌ ఛార్జీలు మాత్రం అందరికీ వర్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T06:37:51+05:30 IST