-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » officers checking in shopping mall-NGTS-AndhraPradesh
-
తూనికలు కొలతల శాఖ తనిఖీలు
ABN , First Publish Date - 2022-09-11T06:05:21+05:30 IST
తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం నగరంలోని పలు షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దుకాణాలపై 61 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడి
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం నగరంలోని పలు షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానుఫ్యాక్చరింగ్ కంపెనీ వివరాలు, వస్తువు బరువు, గడువు తేదీ, ధర, కస్టమర్ కేర్ వంటి వివరాలు లేకుండా పలు దుకాణాలు వస్తువులు విక్రయిస్తున్నట్టు ఈ సందర్భంగా గుర్తించారు. ప్యాకింగ్‌పై ధరలు లేకపోవడం, తదితర కారణాలతో మొత్తం 61 కేసులు (వాల్‌మార్ట్‌పై 13, మెట్రోపై 15, విశాల్ మార్ట్‌పై 5, లైఫ్ స్టైల్‌పై 5, డెకత్లాన్‌పై నాలుగు, క్రోమ్‌పై రెండు, తదితర దుకాణాలు) నమోదు చేశారు. ఇంకా వస్తువు ధర కంటే రూ.50 అదనంగా కలిపి స్టిక్టర్లు అంటించినట్టు గుర్తించి కరాచీవాలాపై మూడు కేసులను అధికారులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సంయుక్త సంచాలకులు జి.రాజేష్‌కుమార్, జిల్లా సంచాలకులు బి.మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.