ఎన్‌ఎస్‌టీఎల్ వ్యవస్థాపన దినోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-04T06:52:49+05:30 IST
ఈ నెల 26న జరగనున్న ఎన్‌ఎస్‌టీఎల్ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలను బుధవారం ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
గోపాలపట్నం, ఆగస్టు 3: ఈ నెల 26న జరగనున్న ఎన్‌ఎస్‌టీఎల్ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలను బుధవారం ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969లో స్థాపించిన ఎన్‌ఎస్‌టీఎల్ దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డీఆర్‌డీవో ప్రధాన ల్యాబ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎన్‌ఎస్‌టీఎల్ భవిష్యత్తులో మరింత సేవలందించే దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ఎన్‌ఎస్‌టీఎల్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్లామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.లక్ష్మీ శ్రీనివాసరావు, శాస్త్రవేత్తలు ఎం.శ్రీనాథ్, కె.శ్రీకాంత్, అర్బన్ కుమార్, కేయూ గోకుల్, ఎస్.గణేశ్, ఎన్‌ఎస్‌టీఎల్ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.