రైతులకు తొమ్మిది గంటల విద్యుత్
ABN , First Publish Date - 2022-12-31T00:29:41+05:30 IST
రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ అందిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె. సంతోష్‌రావు తెలిపారు. ఏపీ పవర్ డిప్లమో ఇంజినీర్ల సంఘం ముద్రిం చిన నూతన క్యాలెండర్, డైరీని శుక్రవారం ఆయన సింహాచలంలో ఆవిష్కరించారు.
సింహాచలం, డిసెంబరు 30 : రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ అందిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె. సంతోష్‌రావు తెలిపారు. ఏపీ పవర్ డిప్లమో ఇంజినీర్ల సంఘం ముద్రిం చిన నూతన క్యాలెండర్, డైరీని శుక్రవారం ఆయన సింహాచలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను విద్యుత్ సంస్థలు చేపట్టవని, ఉద్యోగులకు ఏవిధమైన అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగనన్న కాలనీల విద్యుదీకరణ పనుల్లో జూనియర్ ఇంజినీర్ల పాత్రను కొనియాడారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పే స్కేల్ సమస్యను, 15 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగుల పదోన్నతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఏఈలకు ఏడీఈలుగా పదోన్నతులు కలిపించేందుకు వీలుగా అదనపు సోస్టులు మంజూరు చేస్తామన్నారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఇంజినీర్లను కోరారు. సంస్థ డైరెక్టర్లు మాట్లాడుతూ సంస్థల్లోని నెట్ వర్కును బలోపేతం చేయాలని, వ్యవసాయ సర్వీసులు త్వరగా రిలీస్ చేయడానికి అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, సామగ్రి సమకూర్చాలని, విద్యుత్ సవరణ చట్టం- 2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పని భారానికి తగ్గట్టు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ పవర్ డిప్లమో ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీవీ మహేశ్వరరెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్ బి. రమేష్ ప్రసాద్, ఫైనాన్స్ డైరెక్టర్ డి. చంద్రం, ప్రాజెక్ట్సు డైరెక్టర్ ఏవీవీ సూర్యప్రతాప్, సంఘ ప్రధాన కార్యదర్శి కేవీ శేషారెడ్డి, సలహాదారు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.