కేంద్ర నిధులతో పనులకు వైసీపీ సొంత ప్రచారం

ABN , First Publish Date - 2022-10-01T06:15:57+05:30 IST

సొమ్ముకడిది.. సోకొకడిది అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులకు వైసీపీ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకోవడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు.

కేంద్ర నిధులతో పనులకు వైసీపీ సొంత ప్రచారం
మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు


అనంతగిరి, సెప్టెంబరు 30: సొమ్ముకడిది.. సోకొకడిది అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులకు వైసీపీ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకోవడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు. మూడు రోజులుగా మండలంలో సాగుతున్న ప్రజా పోరుయాత్ర చివరి రోజు గురువారం వాలాసీ, కొండిభ, టోకూరు, అనంతగిరి పంచాయతీల్లో సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. కేంద్రం అనునిత్యం ప్రజలకు పథకాలను ప్రవేశపెడుతుండగా, కేంద్ర నిధులను దారిమల్లించడంతో పాటు తమ గొప్పగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముగింపు సభ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజీపీ మండల నాయకులు తమ్మన్న, శెట్టిరాజు, రాష్ట్ర గిరిజనమోర్చ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షడు కొండబాబు పాల్గొన్నారు. 

Read more