Visakha: డ్రగ్స్ సరఫరా, ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్పై దృష్టి సారించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-12-31T10:48:17+05:30 IST

విశాఖ: న్యూ ఇయర్ (New Year) వేడుకల (Celebrations) సందర్భంగా విశాఖ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు (Special Restrictions) విధించారు.

Visakha: డ్రగ్స్ సరఫరా, ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్పై దృష్టి సారించిన పోలీసులు

విశాఖ: న్యూ ఇయర్ (New Year) వేడుకల (Celebrations) సందర్భంగా విశాఖ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు (Special Restrictions) విధించారు. డ్రగ్స్ (Drugs) సరఫరా, ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)పై దృష్టి సారించారు. ఈ సందర్బంగా సీపీ సీహెచ్ శ్రీకాంత్ (CP CH Srikanth) మాట్లాడుతూ ఆర్కే బీచ్ (RK Beach) రోడ్డులో శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు.. వాహనాలకు అనుమతి లేదన్నారు. అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వాహనాలకు, పాదచారులకు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదన్నారు. నగరంలో బీఆర్టీఎస్ రోడ్డులో రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ ప్రధాన కూడళ్లలో 90 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్.. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బీచ్ రోడ్డు, రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతిస్తున్నట్లు సీపీ శ్రీకాంత్ తెలిపారు.

ఎవరైనా డ్రగ్స్ వినియోగించి పట్టుబడితే.. కార్యక్రమాలు నిర్వహించిన ప్రాంతంతో పాటు నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని సీపీ సీహెచ్ శ్రీకాంత్ చెప్పారు. బీచ్ రోడ్లో బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని, నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో... మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, సైలెన్సర్ లేకుండా పెద్ద శబ్ధాలతో వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేస్తామని సీపీ సీహెచ్ శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-31T10:48:21+05:30 IST