వెస్టిండీస్‌, శ్రీలంక క్రీడాకారిణుల నెట్‌ ప్రాక్టీస్‌

ABN , First Publish Date - 2022-11-12T01:20:35+05:30 IST

ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి జరగనున్న క్వాడ్రాంగులర్‌ మహిళల అండర్‌-19 క్రికెట్‌ టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న భారత్‌-ఏ, భారత్‌-బి, వెస్టిండీస్‌, శ్రీలంక జట్ల క్రీడాకారిణులు ముమ్మర సాధన చేస్తున్నాయి.

వెస్టిండీస్‌, శ్రీలంక క్రీడాకారిణుల నెట్‌ ప్రాక్టీస్‌
ఫిట్‌నెస్‌ సాధన చేస్తున్న భారత్‌ జట్టు క్రీడాకారిణులు

విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 11: ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి జరగనున్న క్వాడ్రాంగులర్‌ మహిళల అండర్‌-19 క్రికెట్‌ టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న భారత్‌-ఏ, భారత్‌-బి, వెస్టిండీస్‌, శ్రీలంక జట్ల క్రీడాకారిణులు ముమ్మర సాధన చేస్తున్నాయి. శుక్రవారం వీడీసీఏ-బి గ్రౌండ్‌లో వెస్టిండీస్‌ క్రీడాకారిణులు బ్యాటింగ్‌, బౌలింగ్‌, క్యాచ్‌ ప్రాక్టీస్‌ చేశారు. శ్రీలంక జట్టు క్రీడాకారిణులు ఉదయం ప్రధాన గ్రౌండ్‌లో ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌ సాధన చేశారు. ఆతిథ్య భారత్‌-ఏ, బి జట్ల క్రీడాకారిణులు శుక్రవారం సాయంత్రం ప్రధాన గ్రౌండ్‌లో ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌ సాధన చేశారు. భారత్‌తోపాటు వెస్టిండీస్‌, శ్రీలంక జట్ల క్రీడాకారిణులు శనివారం ఉదయం సాధన చేసి ఆదివారం నుంచి జరిగే మ్యాచ్‌ల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-11-12T01:20:35+05:30 IST

Read more