నేడు నూకాంబిక అమ్మవారి ముగింపు జాతర
ABN , First Publish Date - 2022-04-30T06:08:14+05:30 IST
స్థానిక నూకాంబిక అమ్మవారి నెల పండగ శనివారం జరగనున్నది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయనున్నారు.
అనకాపల్లిటౌన్, ఏప్రిల్ 29: స్థానిక నూకాంబిక అమ్మవారి నెల పండగ శనివారం జరగనున్నది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. గత నెల 30వ తేదీన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం జరిగే నెల పండగతో జాతర ముగియనున్నది. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో బీఎల్ నగేశ్ తెలిపారు. శనివారం భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికసంఖ్యలో వచ్చే అవకాశముంది. నెల పండగ సందర్భంగా సాయంత్రం ఐదున్నర గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనం నిలిపివేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో నగేశ్ తెలిపారు.