విశాఖ జిల్లా కోర్టుకు హాజరు కానున్న లోకేష్

ABN , First Publish Date - 2022-02-28T16:36:27+05:30 IST

నారా లోకేష్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

విశాఖ జిల్లా కోర్టుకు హాజరు కానున్న లోకేష్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టిఎన్ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తనపై అసత్యఆరోపణలు ప్రచురించారని లోకేష్ సాక్షిపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కోర్టుకు హాజరైన విషయం విధితమే. తదిపరి విచారణ 28వ తేదీ (సోమవారం)కి వాయిదా పడటంతో ఈ రోజు మరోమారు విశాఖ జిల్లా కోర్టుకు లోకేష్ స్వయంగా హాజరు కానున్నారు.

Updated Date - 2022-02-28T16:36:27+05:30 IST