నాడు-నేడు పనులు తనిఖీ చేసిన నాబార్డు బృందం

ABN , First Publish Date - 2022-09-30T06:19:20+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో మొదటి, రెండోదశ నాడు-నేడు పనులను నాబార్డు బృందం గురువారం పరిశీలించింది.

నాడు-నేడు పనులు తనిఖీ చేసిన నాబార్డు బృందం
పెందుర్తి మండలం శాంతిపురంలో నాడు-నేడు పనులు తనిఖీచేస్తున్న నాబార్డు అధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో మొదటి, రెండోదశ నాడు-నేడు పనులను నాబార్డు బృందం గురువారం పరిశీలించింది. పెందుర్తి మండలం శాంతిపురం, అనకాపల్లి జిల్లాలో జేఎస్‌.అగ్రహారం, కశింకోటలో పాఠశాలలను తనిఖీచేశారు. పనుల్లో నాణ్యతను పరిశీలించిన బృందం, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల కమిటీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాకవరపాలెంలో వైద్యకళాశాల నిర్మించనున్న భూములను పరిశీలించారు. ఈ పర్యటనలో నాబార్డు సీనియర్‌ అధికారి ప్రభాకర్‌ బృందంతోపాటు విశాఖ డీఈవో ఎల్‌.చంద్రకళ, సర్వశిక్ష అభియాన్‌ ఏపీసీ బి.శ్రీనివాసరావు, ఈఈ నరసింహారావు పాల్గొన్నారు. 


Read more