అత్యధిక కేసులు పరిష్కారం కావాలి

ABN , First Publish Date - 2022-03-05T06:40:43+05:30 IST

ఈ నెల 12న జరుగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం కావాలని, అందుకు న్యాయాధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తగిన చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ అవధానం హరిహరనాఽథ శర్మ కోరారు

అత్యధిక కేసులు పరిష్కారం కావాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాఽథ శర్మ

విశాఖపట్నం, మార్చి 4: ఈ నెల 12న జరుగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం కావాలని, అందుకు న్యాయాధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తగిన చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ అవధానం హరిహరనాఽథ శర్మ కోరారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ, డీడీ శైలజ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:40:43+05:30 IST