ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ కసరత్తు
ABN , First Publish Date - 2022-10-17T07:19:32+05:30 IST
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం చేపట్టాల్సిన అంశాలపై నేతలు ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
మహారాణిపేట, అక్టోబరు 16:
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం చేపట్టాల్సిన అంశాలపై నేతలు ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి గాడు చిన్నకుమారిలక్ష్మి విజయానికి ఏ విధంగా ముందుకు పోవాలో నిర్దేశిస్తూ అధిష్ఠానం పంపిన ప్రణాళికపై సమావేశంలో నేతలు చర్చించారు. ఎన్నికల్లో కీలకంగా భావించే ఓటర్ల నమోదుపై నియోజకవర్గాల వారీగా నాయకులు ఫోకస్ పెట్టాలని సమావేశం నిర్ణయించింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతి విద్యార్థిని కలిసి ఓటరుగా నమోదుచేసుకునేలా అవగాహన కల్పించాలని ప్రతిపాదించారు. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విశాఖ దక్షిణ, భీమిలి ఇన్చార్జిలు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్నికుమారి లక్ష్మి, జీవీఎంసీలో పార్టీ ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాస్, పార్టీ నేతలు పాశర్ల ప్రసాద్, చోడే పట్టాభి, చిక్కాల విజయ్, పోతనరెడ్డి, బొండా జగన్, రాజమండ్రి నారాయణ, ఆరేటి మహేష్, ఒమ్మి సన్యాసిరావు, కాళ్ల శంకర్, రాజశేఖర్ పాల్గొన్నారు.