-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » MLA Amar who ignored the development-NGTS-AndhraPradesh
-
అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యే అమర్
ABN , First Publish Date - 2022-03-05T06:30:28+05:30 IST
అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధిని ఎమ్మెల్యే అమర్‌నాథ్ విస్మరించారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద
అనకాపల్లి, మార్చి 4: అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధిని ఎమ్మెల్యే అమర్‌నాథ్ విస్మరించారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.2 వేల కోట్లతో అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశామన్నారు. గత మూడేళ్లలో అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రహదారులకు గుంతలు పూడ్చలేని వారు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. విభజన చట్టంలో ఏముందో తెలుసుకొని మూడు రాజధానుల గురించి మాట్లాడితే బాగుంటుందని బుద్ద హితవు పలికారు.