Minister Roja: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మంత్రి రోజా వైఖరి

ABN , First Publish Date - 2022-10-17T18:33:22+05:30 IST

జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా...

Minister Roja: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మంత్రి రోజా వైఖరి

అమరావతి (Amaravathi): జనసేన నేతలు (Janasena Leaders) తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా (Minister Roja) ఇప్పటివరకు విశాఖ (Visakha) ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ అసలు విమానాశ్రయంలో ఏం జరిగింది? జనసేన శ్రేణులను ఎవరు రెచ్చగొట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.


విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులకు మంత్రి రోజా వేలు చూపుతూ రెచ్చగొట్టిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. శనివారం విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజాపై హత్యాయత్నం జరిగిందని, ఒక సీఐ, ఎస్ఐపై దాడి చేశారని ఫిర్యాదు అందిందంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. రోజాను హత్య చేయాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ సూచనలతోనే జనసేన కార్యకర్తలు రోజా కారును అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. మంత్రి విమానాశ్రయానికి వచ్చే సమయానికి పవన్ అక్కడికి రాలేదని, ఆయనను అరెస్టు చేయించాలనే దురుద్దేశంతోనే అలా కేసు పెట్టారని జనసేన నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-10-17T18:33:22+05:30 IST